సీఎల్పీ భేటీ: రేపు కొత్త నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11-30 కి ప్రోటెంస్పీకర్ ముంతాజ్  అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి.

  • Published By: chvmurthy ,Published On : January 16, 2019 / 11:40 AM IST
సీఎల్పీ భేటీ: రేపు కొత్త నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

Updated On : January 16, 2019 / 11:40 AM IST

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11-30 కి ప్రోటెంస్పీకర్ ముంతాజ్  అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11-30 కి ప్రోటెంస్పీకర్ ముంతాజ్  అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ  సందర్భంగా  కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) భేటీ రేపు ఉదయం 9 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో  సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. 2018 డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 19 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ 88 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాలు, టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. 

ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులైనప్పటికీ ఇంతవరకు సీఎల్పీ భేటీ జరగలేదు. అయితే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో రేపు ఉదయం 9గంటలకు భేటీ అయ్యి సీల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా సీఎల్పీ రేసులో టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వహాక అధ్యక్షుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.