గెలుపు ఖాయం : సింహం సింగిల్‌గానే వస్తుంది
గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే

గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే
గుంటూరు: వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. ప్రతిపక్షాలకు ధీటుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూనే వైసీపీ సత్తా ఏంటో వివరిస్తున్నారు. వైసీపీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగినా బంపర్ మెజార్టీ సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని చెప్పారు.
Read Also : పెద్ద కొడుకు కాదు.. పెద్ద తాత: చంద్రబాబుపై మోత్కుపల్లి సెటైర్లు
ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలన్నారు. వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే, చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని, జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల కోరారు. జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు కానీ, బాబు వస్తే కరవు వచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ‘బై బై’ చెబుదామని షర్మిల అన్నారు.
మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. బస్సు యాత్ర ద్వారా ఆమె ప్రచారం చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
Read Also : వైసీపీలో చేరిన మాజీ మంత్రి: చంద్రబాబుకు ఓటమి తప్పదు