IND vs BAN : శుభ్‌మన్ గిల్ శతక్కొట్టినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

IND vs BAN
India vs Bangladesh : నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (121; 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగగా ఆఖర్లో అక్షర్ పటేల్ (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినప్పటికీ ఫలితం దక్కలేదు.
Ravindra Jadeja : వన్డేల్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎలైట్ లిస్ట్‌లో చోటు..
మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్ (26) ఫర్వాలేదనిపించగా రోహిత్ శర్మ (0), తిలక్ వర్మ (5), ఇషాన్ కిషన్ (5), రవీంద్ర జడేజా (7)లు విపలం కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు తీయగా మహేదీ హసన్, తాంజిమ్ హసన్ సాకిబ్ చెరో రెండు, షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షకీల్ అల్ హసన్ (80; 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తౌహిద్ హృదయ్ (54; 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా నసుమ్ అహ్మద్(44; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Asia Cup 2023 : ఆసియాకప్ నుంచి ఔట్ .. ఎన్ని టీవీలు పగిలాయో..? నెట్టింట పాక్ పై జోకులు
భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ 2023 ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీలంక జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.