Rohit Sharma : దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ధోని రికార్డు..
తొలి టెస్టు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది.

Rohit on verge of surpassing Dhoni in elite list ahead of 1st test
Rohit Sharma – MS Dhoni : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా వరుస విజయాలతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఈ ఓటమితో అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు నిరుత్సాహం చెందారు. ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నూతనోత్సాహంతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యాడు. సెంచూరియన్ వేదికగా మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆరంభం కానుంది.
దక్షిణాఫ్రికా గడ్డ పై ఇప్పటి వరకు భారత్ టెస్టు సిరీస్ నెగ్గ లేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఈ సారి టీమ్ఇండియా చరిత్ర సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డబ్ల్యూటీస్ 2023-25 సైకిల్‌లో ఫైనల్ చేరుకోవాలంటే ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ విజయం సాధించడం చాలా ముఖ్యం.
రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డు..
ఇక తొలి టెస్టు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు బాదితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని రికార్డును అధిగమిస్తాడు. టీమ్ఇండియా తరుపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 104 టెస్టుల్లో 91 సిక్స్‌లు బాదాడు.
ఆ తరువాత మహేంద్ర సింగ్ ధోని 90 టెస్టుల్లో 78 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 52 టెస్టుల్లో 77 సిక్స్‌లు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరగనున్న మొదటి టెస్టు మ్యాచులో రోహిత్ ఒక్క సిక్స్ కొడితే ధోని సరసన చేరుతాడు అదే రెండు సిక్స్‌లు బాదితే మహేంద్రుడిని అధిగమించి రెండో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఉన్న ఫామ్‌ను తీసుకుంటే ఈ మ్యాచ్‌లోనే ధోనిని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండయ్యా..