Asaduddin Owaisi: మళ్లీ ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి.. ఆ పార్టీకి మా మద్దతు

తెలంగాణ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయంపై అసదుద్దీన్ స్పందించారు.

Asaduddin Owaisi: మళ్లీ ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి.. ఆ పార్టీకి మా మద్దతు

Asaduddin Owaisi

Updated On : October 16, 2023 / 7:52 PM IST

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.

‘ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లుగా రైతుల కోసం బాగా పనిచేశారని ప్రజలు నమ్ముతున్నారు. రైతు బీమాను కేసీఆర్ ప్రారంభించారు. దాన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాపీ కొట్టారు. ప్రజలు కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను’ అని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఆకర్షించేలా ఉందని అసదుద్దీన్ చెప్పారు. మైనార్టీలకు బడ్జెట్ పెంచుతామని చెప్పారని తెలిపారు. అలాగే, ప్రజలకు రూ.400కే గ్యాస్ ఇస్తామని అన్నారని గుర్తుచేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయంపై అసదుద్దీన్ స్పందించారు. ‘ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్ని స్థానాల్లో పోటీచేస్తామన్న విషయంపై త్వరలోనే మేము ప్రజలకు చెబుతాం’ అని వ్యాఖ్యానించారు.

కాగా, దేశ విభజన ఎన్నటికీ జరగకుండా ఉంటే బాగుండేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్-పాక్ విభజన జరగడం దురదృష్టకరమని చెప్పారు. దేశ విభజనకు బాధ్యుడు ఎవరన్న విషయంపై డిబేట్ పెడితే తాను ఈ అంశాన్ని సంపూర్ణంగా వివరించి చెబుతానని అన్నారు.

Harish Rao : నమ్మకానికి నిదర్శనం కేసీఆర్, నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్- మంత్రి హరీశ్ రావు