కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నారు.. నేనేమో..: బండి సంజయ్

కార్యకర్తగా మొదలై ప్రజల కోసం కొట్లాడి ఎంపీని అయ్యానని బండి సంజయ్ చెప్పారు. బీజేపీకి ఓటేసి..

కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నారు.. నేనేమో..: బండి సంజయ్

Bandi Sanjay (Photo : Facebook)

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నారంటూ బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ మాట్లాడారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను తన తాత, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.

కార్యకర్తగా మొదలై ప్రజల కోసం కొట్లాడి ఎంపీని అయ్యానని బండి సంజయ్ చెప్పారు. బీజేపీకి ఓటేసి మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని అన్నారు. కేసీఆర్ వన్నీ కొంపలు ముంచే ఆలోచనలేనని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని అన్నారు. అవగాహనతోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. కృష్ణాజలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని, దోషులను జైలుకు పంపాలని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చిందని చెప్పారు.

CAG: కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..