Telangana : దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డ్.. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు, ఎక్కడెక్కడ అంటే..

Telangana : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యాయి.

Telangana : దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డ్.. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు, ఎక్కడెక్కడ అంటే..

Telangana Medical Colleges

Updated On : July 5, 2023 / 8:22 PM IST

Telangana – Medical Colleges : తెలంగాణలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాలేజీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త కాలేజీలు వస్తే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీని ద్వారా దేశంలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకోనుంది. 9ఏళ్లలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి.

Also Read..Dharmapuri Constituency: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం

”జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం కానుంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. మొత్తం 34 మెడికల్ కాలేజీలతో దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకోనుంది తెలంగాణ. ఈ తొమ్మిదేళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు” అని మంత్రి హరీశ్ అన్నారు.

Also Read..Kishan Reddy: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?