Eatala Rajender : బీజేపీ అధికారంలోకి వస్తేనే.. బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది- ఈటల రాజేందర్
తెలంగాణకు గొప్ప సంప్రదాయాన్ని అందిస్తానన్న ముఖ్యమంత్రి.. మద్యం తాగించే విషయంలో, డబ్బు ఎరవేయడంలో నెంబర్ వన్ గా మార్చారని విమర్శించారు. Eatala Rajender

Eatala Rajender On Elections
Eatala Rajender On Elections : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు దేశంలోనే అత్యధిక డబ్బు ఖర్చుపెట్టేటటువంటి నీచమైన సంస్కృతిని తెలంగాణకు అందించిన ఘనత కేసీఆర్ దే అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో డబ్బున్నోళ్లే గెలిచేలా వాతావరణం మార్చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణలో డబ్బు, మద్యం ప్రభావం తక్కువగా ఉండేదని.. సమైక్య రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ లో ఖర్చయ్యే దాంట్లో నాలుగో వంతు ఖర్చుపెడితే ఇక్కడ గెలిచేవారని ఈటల రాజేందర్ చెప్పారు.
వేల ఎకరాల భూమిని అక్రమంగా అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుద్దామని కేసీఆర్ నిర్ణయించుకున్నారు అని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గాలకు రూ.15కోట్లు చేర్చారని వెల్లడించారు. ఇతర పార్టీల నాయకులను సీఎం కేసీఆర్ డబ్బులతో కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు గొప్ప సంప్రదాయాన్ని అందిస్తానన్న ముఖ్యమంత్రి.. మద్యం తాగించే విషయంలో, డబ్బు ఎరవేయడంలో నెంబర్ వన్ గా మార్చారని విమర్శించారు. నిక్కచ్చిగా పని చేసే కార్యకర్తలకు అవకాశం లేకుండా చేశారని, డబ్బున్నోళ్లే గెలిచేటట్లు వాతావరణం మార్చారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కి ఓటేస్తా అంటేనే.. పెన్షన్ వస్తుంది, దళితబంధు, బీసీబంధు వస్తుందని లేదంటే రావని బెదిరిస్తున్నారని ఈటల ఆరోపణలు చేశారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద వీళ్లకు నమ్మకం లేదన్నారు. బీజేపీకి ఓటేస్తే.. మోటర్లకు మీటర్లు వస్తాయని, పెన్షన్లు పోతాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజానికి.. బీజేపీ గెలిస్తేనే.. ఇవన్నీ టైమ్ కు మీ అకౌంట్లలోకి వస్తాయని, ఒకటో తేదీకే జీతాలు వస్తాయని ఈటల రాజేందర్ చెప్పారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు?
ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఈటల రాజేందర్ వాపోయారు. అమరవీరులు కలలుగన్న బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే.. బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ చిన్నమ్మ.. పార్లమెంటు వేదికగా.. మన యువతకు ధైర్యం చెప్పారు. తెలంగాణకు మా మద్దతు ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్న తర్వాతనే.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు ఈటల రాజేందర్.
Also Read : బీజేపీ హంగ్ ఆశలు.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం!