త్వరలో అభ్యర్థుల ప్రకటన? టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై ఉత్కంఠ

ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి పెట్టనున్నారు.

త్వరలో అభ్యర్థుల ప్రకటన? టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై ఉత్కంఠ

TDP Janasena Candidates List

Updated On : January 30, 2024 / 4:43 PM IST

TDP Janasena Candidates List : టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచాయి. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుపైన రెండు పార్టీలూ ఫోకస్ పెట్టాయి. దాదాపుగా వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపైన ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే రెండుసార్లు చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి పెట్టనున్నారు. చంద్రబాబు తన రా కదలిరా సభలకు విరామం ఇచ్చారు. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టోపైనా చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి. ఫిబ్రవరి నెల మొత్తం కూడా పొత్తులకు సంబంధించి ఒక కీలక ప్రకటన టీడీపీ-జనసేన మధ్య రాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన రా కదలి రా బహిరంగ సభలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 4వ తేదీ వరకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రెండు రోజుల్లో కలవబోతున్నారు. వీలైనంత తొందరలోనే పవన్ ను కలిసి సీట్ల కేటాయింపుపై చర్చించి ఖరారు చేసుకోనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చంద్రబాబు, పవన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యలనకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నారు.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

చంద్రబాబు ఇప్పటికే 15 రా కదలి రా సభలు పూర్తి చేశారు. మిగిలిన సభలకు సంబంధించి 4వ తేదీ నుంచి షెడ్యూల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సీట్ల కేటాయింపుపై ఫోకస్ పెట్టారు. సీట్ల కేటాయింపుపై రెండు పార్టీలు రెండుసార్లు చర్చించాయి. చంద్రబాబు పవన్ తో రెండుసార్లు చర్చలు జరిపారు. ఎన్ని సీట్లు కేటాయించాలి? అభ్యర్థుల వివరాలు, దానికి సంబంధించిన కసరత్తు చేశారు పవన్ కల్యాణ్. జనసేన ఎన్ని సీట్లు కోరింది? అక్కడ బలాబలాలకు సంబంధించి చంద్రబాబు కూడా నివేదికలు తెప్పించుకున్నారు. ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

Also Read : వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఈసారి చంద్రబాబు, పవన్ కలిశాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు? అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రానుంది. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు అనేదానిపై రెండు పార్టీలు కూడా బహిరంగంగా ప్రకటన చేయబోతున్నాయి. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.