సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయిన బాల్క సుమన్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు బాల్క సుమన్.

Balka Suman
Balka Suman : కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కేసు పెట్టారని తెలిపారు. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు బాల్క సుమన్.
కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సుమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు పెట్టారు. దీంతో మంచిర్యాల పోలీసులు సుమన్ కు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న సందర్భంలో బాల్క సుమన్ మరోసారి సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేత గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే తాము సహించేది లేదన్నారు. తమ నేత గురించి మాట్లాడినందుకే తామూ మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
Also Read : గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..
రాబోయే రోజుల్లో కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అలాగే స్పందించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు సుమన్. ఉద్యమ నేతను అవమానించడం తగదన్నారు బాల్క సుమన్. ప్రభుత్వ అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు సుమన్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు. న్యాయ పోరాటం ద్వారా అక్రమ కేసులను ఎదుర్కొంటామని సుమన్ చెప్పారు.
Also Read : నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది వీరిద్దరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి