Cm Revanth Reddy : తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్లే- సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..
తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని, తనకు రాహుల్ కు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy : ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్లేనని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకి పంపాలనే ఆలోచన లేదన్నారు.
సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటు పీసీసీ కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చిందని, రేపటిలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని, తనకు రాహుల్ కు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : సుప్రీంకోర్టు లాయర్‌కు హైడ్రా కమిషనర్ వార్నింగ్..! అసలేం జరిగిందంటే..
ప్రతిపక్ష నేతలను అర్జెంట్ గా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన నాకు లేదు..
”తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళతాం. అర్జెంట్ గా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన నాకు లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నా.
కులగణన ఆషామాషీగా చేసింది కాదు..
కులగణన ఆషామాషీగా చేసింది కాదు. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చేసింది. బీసీలు ఐదున్నర శాతం పెరిగారు. ఈ విషయంలో సభలోనే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లెక్కలతో సహా చూశాక ఒప్పుకున్నారు. మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నా.
రాహుల్ గాంధీతో గ్యాప్ లేదు..
పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ నేను కోరలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయి. వారికి తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేమీ లేదు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటాను తప్ప.. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు.
Also Read : అంతా సర్దుకున్నట్లేనా? ఎమ్మెల్యేలు చల్లబడినట్లేనా? ఇంతకీ సీఎల్పీ భేటీలో తేలిందేమిటి..
పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యం. రాహుల్ కి, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే నాకేం. పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ప్రతి ఒక్క విమర్శకు నేను స్పందించాల్సిన అవసరం లేదు” అని హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.