రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి : కేటీఆర్

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం లభిస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి : కేటీఆర్

KTR

KTR : రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.. ఆరు గ్యారెంటీలు అనే రంగుల కలను కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చూపించింది. 420 అడ్డగోలు, నోటికొచ్చిన హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని విమర్శించారు. ఏడు నెలలు పూర్తయినా హామీలు అమలు కాలేదు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : JNTU : ఇలా అయితే తినేదెలా.. కాలేజీ క్యాంటిన్ చట్నీలో ఈదుతూ కనిపించిన ఎలుక.. వీడియో వైరల్

పార్టీ ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చాం. పార్టీ ఫిరాయింపులపై ‘కాంగ్రెస్ వింతలు, విడ్డురాలంటూ’ పత్రికా వార్తలను మీడియాకు కేటీఆర్ చూపించారు. రాహుల్ గాంధీ తుక్కుగూడాలో తుక్కు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ న్యాయ పత్రలో ఫిరాయింపుల చట్టానికి సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి.. దానిని పాటించాలంటూ కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ఏమేమి ఇస్తున్నారో తెలీదు.. పార్టీలో చేర్చుకుంటున్నారు. తెలంగాణలో న్యాయపత్ర అంటారు.. చేసేది అన్యాయం.

Also Read : బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే. ఫిరాయింపుల పై హైకోర్టులో న్యాయం లభిస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. హైకోర్టులో న్యాయం లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రాజ్యాంగ న్యాయ నిపుణులని సంప్రదించాం. ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ను కలుస్తాం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగడతామని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం, టీడీపీ, బీఎస్పీ విలీనం అయ్యారు. ఒకటేసారి 26 మంది వెళితే అది విలీనం కాదు. ఒక్కొక్కరుగా వెళ్తే ఫిరాయింపులు.. విలీనం కాదని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుందో కాంగ్రెస్ చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కి ఉన్న 99 ఎంపీల్లో 30 మంది వేరే పార్టీలో చేరితే అది కాంగ్రెస్ కు సమ్మతమేనా? తెలంగాణ లో పార్టీ ఫిరాయింపులను మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు.