Harish Rao : కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పండి- హరీశ్ రావు

కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.

Harish Rao : కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పండి- హరీశ్ రావు

Harish Rao : కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. పదేళ్లు పాలించిన బీజేపీ ఏం చేసిందో చెప్పడం లేదు, 5 నెలలు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడం లేదన్నారు హరీశ్ రావు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన తప్పుడు హామీకి కాంగ్రెస్ అధిష్టానం క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ మీడియా సమావేశంలో మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

”రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలి. కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే తెలంగాణ ప్రజలు తమ ఓటు బీఆర్ఎస్ కి వేసి కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలి. ఏ గ్రామాల్లో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయో అక్కడే కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగండి. అమలు కాని చోట బీఆర్ఎస్ కు ఓటు వేయండి. 100 రోజుల్లో హామీ చేస్తానన్న బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని మెదక్ నుండే ప్రారంభించారు.

రాష్ట్రమంతా ఉద్యమం చేపట్టారు. ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారు. పదేళ్ల పాలనలో అదానీ, అంబానీలకే మేలు చేశారు తప్ప పేదవాడికి బీజేపీ చేసిందేమీ లేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.

మెదక్ బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు, ఫేక్ వీడియోలతో ప్రచారం చేయబోతున్నారు. ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు గమనించాలి. తప్పుడు వార్తలపై, సోషల్ మీడియా ప్రచారాలపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. నిజాలను గ్రహించి మెదక్ ప్రజలు ఓటు వేయాలి” అని హరీశ్ రావు అన్నారు.

అటు.. ములుగులో రోడ్ షోలో హరీశ్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. తాను గెలిచిన నెలలో రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తానని వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు.

హరీశ్ రావు కామెంట్స్..
* కాంగ్రెస్ నాయకులవి మోసపూరిత మాటలు
* కేసీఆర్ ఇచ్చినట్లుగా ఇస్తానన్న 2వేల పెన్షన్ ఇచ్చి చూపిండు
* కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే 10వేల రూపాయలు అడగండి
* కాంగ్రెస్ వాళ్లకు మీరు సురుకు పెట్టండి, అసెంబ్లీలో నేను ప్రశ్నిస్తా
* కాంగ్రెస్ వాళ్ళు రాగానే రైతుల మోటార్లు కాలుతున్నాయి
* తులం బంగారం అన్నారు. అది రాలేదు. కానీ, బంగారం కొండెక్కింది
* తెలంగాణలో ఈ సీజన్ లో లక్ష పెళ్ళిళ్ళు అయ్యాయి. అంటే లక్ష తులాల బంగారం బాకీ పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు
* కొత్త ప్రభుత్వం ఏర్పడితే మంచి పనులు చేయాలే. కానీ వచ్చుడు వచ్చుడే అన్ని పోయినాయి
* ములుగు మండలానికి ఫారెస్ట్ కాలేజ్, యూనివర్సిటీ, చెక్ డ్యాంలలో నీళ్ళు తెచ్చిండు కేసీఆర్
* కేసీఆర్ ఉన్నప్పుడే గజ్వేల్ కి కలర్
* గజ్వేల్ మీద రేవంత్ కి ఉంటదా, కేసీఆర్ కా
* ఏం పాపం చేసిండు అని కేసీఆర్ నీ రేవంత్ తిట్టవచ్చ
* కేసీఆర్ ని తిట్టడం అంటే మనల్ని తిట్టినట్లు కాదా
* కేసీఆర్ ఇచ్చిన వంద కోట్ల రూపాయల నిధులను రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వం
* కాంగ్రెస్ తో పొంచి ఉన్న అపాయంకు మీ దగ్గరే ఉపాయం ఉంది అది మీ ఓటే
* వెంకట్రామిరెడ్డి గెలిస్తే కేసీఆర్, హరీశ్ రావు గెలిచినట్లే
* కాంగ్రెస్ మీద కోపంతో బిజెపికి ఓటు వేస్తే ఇంకా ఆగమే
* క్యాలెండర్ తో ఓట్లు వేయమని అడుగుతున్నాడు
* క్యాలెండర్ తో మీ కడుపు నిండుతదా? ఆలోచించాలి
* మన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు గట్టిగా గుద్ది కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలింపించుకున్నారు
* భార్యలను భర్తలకు దూరం చేసే రఘునందన్ రావుకి ఓటు వేస్తారా?
* దేవుడు దేవుడే, ఓటు గుద్దుడు గుద్ధుడే…
* ఆర్ అండ్ ఆర్ కాలనీలో మిగిలిపోయిన పనులను, ప్యాకేజీలను తప్పకుండా శ్రద్ధతో చేస్తాం. నేను, వెంకట్రామిరెడ్డి మాటిస్తున్నాం.

Also Read : నో బెయిల్.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు