Eatala Rajender : దెబ్బ కొడితే దిమ్మతిరగాలి, ఆరునూరైనా ఈసారి కేసీఆర్‌ను ఓడిస్తాం, వారికి రూ.5లక్షలు ఇస్తాం- ఈటల రాజేందర్

Eatala Rajender : కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.600 కోట్లు

Eatala Rajender : దెబ్బ కొడితే దిమ్మతిరగాలి, ఆరునూరైనా ఈసారి కేసీఆర్‌ను ఓడిస్తాం, వారికి రూ.5లక్షలు ఇస్తాం- ఈటల రాజేందర్

Eatala Rajender (Photo : Twitter)

Updated On : July 4, 2023 / 1:05 AM IST

Eatala Rajender – KCR : ఆరు నూరైనా ఈసారి కేసీఆర్ ను ఓడించి తీరుతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ ను ఓడించడానికి మా దగ్గర డబ్బు, మందు, బిర్యానీలు లేవు.. ఉన్నదల్లా ఆత్మగౌరవం నిండిన ప్రజల ఆశీర్వాదం మాత్రమే అని ఈటల అన్నారు. ఈసారి దెబ్బ కొడితే దిమ్మతిరగాలని ఈటల చెప్పారు. హుజూరాబాద్ లో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలంగాణలో అలాంటి తీర్పే వస్తుందని ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ను మట్టిలో కలిపేస్తారని వ్యాఖ్యానించారు.

”తెలంగాణను పాలిస్తున్న జిల్లా పాత మెదక్ జిల్లా. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించిన నాడు జిల్లా గర్వ పడ్డది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఈ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పోలిక లేదు. తెలంగాణ యువకులు, విద్యార్థులు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు అని అంటున్నారు.(Eatala Rajender)

Also Read..Raghunandan Rao : నన్ను చూసి ఓట్లు వేశారు, బీజేపీని చూసి కాదు, 100కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేదు- రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీతో జతకడితే వారి పనిపోయినట్లే. ఈ మూడేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్ లలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోయింది. బీఆర్ఎస్ పార్టీని, జిత్తుల మారి కేసీఆర్ ను ఇంటికి పంపే సత్తా బీజేపీకే ఉంది. పోలీసులు లేకుండా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పల్లెల్లో తిరిగే పరిస్థితి లేదు.

దేశంలో రైతులను ఆదుకునే సర్కార్ కేసీఆర్ సర్కార్ అని ఇతర రాష్ట్రాలతో మాట్లాడారు. తెలంగాణలో రబీలో నోటికాడి పంట వానలకు నేలపాలు అయితే 10వేలు ఇస్తానని 5 పైసలు కూడా ఇవ్వలేదు. పంజాబ్, మహారాష్ట్ర రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారు. తెలంగాణ కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఇచ్చే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా? బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తాం. ధాన్యం కొనలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఎకరాకు రూ.5 వేలు ఇచ్చి ధాన్యం అమ్ముకుంటే కటింగ్ పేరుతో ఒక్కొక్కరికి రూ.5 వేలు తీసుకున్నారు.

మేనిఫెస్టోలో పెట్టిన రూ.లక్ష రుణమాఫీ ఏమైంది? సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి. చేతలు గడప దాటలేదు. తెలంగాణ నిరుద్యోగుల్లారా కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. టీఎస్ పీఎస్ సీ లో ప్రభుత్వ పెద్దల అండదండలతో పేపర్లు లీక్ అయ్యాయని విచారణలో తేలినా చర్యలు తీసుకోలేదు. చదువుకుంటే ఉద్యోగం రాదు. పైరవీలు చేస్తే ఉద్యోగం వస్తుందని కేసీఆర్ సర్కార్ నిరూపిస్తోంది.(Eatala Rajender)

Also Read..Jitender Reddy : మొన్న కౌంటర్లు, ఈరోజు కౌగిలింతలు.. జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ అందుకేనా..?

తెలంగాణలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు. లిక్కర్ ద్వారా రూ.45వేల కోట్ల ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలన్నీంటికీ ఇస్తే రూ.25 వేల కోట్లు కావు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని మోసం చేశారు. మోదీ సర్కార్ దేశంలో మూడున్నర కోట్ల ఇళ్లు కట్టించింది.
సమ్మె చేయడం కార్మికుల హక్కు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.600 కోట్లు ఖర్చు చేశారు ఏమైంది? పైసలు ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రజల ఆశీర్వాదంతో 6సార్లు నేను గెలిచా. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట దావత్ లు చేశారు. సీఎం కేసీఆర్ ను ఓడగొట్టేందుకు ఆత్మగౌరవం సిద్ధంగా ఉంది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం.

మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మెదక్ నియోజకవర్గంలో బహిరంగసభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మెదక్ టౌన్ లో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.