గాన కోకిలకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన సల్లూ భాయ్

మట్టిలో మాణిక్యం రేణు మండల్‌కు ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్..

  • Published By: sekhar ,Published On : August 28, 2019 / 07:04 AM IST
గాన కోకిలకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన సల్లూ భాయ్

మట్టిలో మాణిక్యం రేణు మండల్‌కు ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్..

రేణు మండల్.. ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. రన్నింగ్ ట్రైన్‌లో పాడిన పాటే తన లైఫ్ రన్‌కి ఉపయోగపడుతుందని, తన తలరాతను మార్చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు.  పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు రేణు పాట విని ప్రశంసిస్తున్నారు.

ఆమె వాయిస్‌కు ఫిదా అయిన హిమేష్ రేష్మియా తను రూపొందిస్తున్న తేరీ మేరీ కహానీ ఆల్బమ్‌లో ఆమెతో పాట పాడించిన సంగతి తెలిసిందే. త్వరలో తన సినిమాలోనూ ఆమెతో పాడిస్తానని మాటిచ్చాడు. ఇదిలా ఉంటే రేణు గాత్రానికి ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఆమెకు రూ.55 లక్షలు విలువ చేసే ఓ ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడనే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read Also : పహిల్వాన్ – జ్యూక్ బాక్స్..

రేణు మండల్ పాట విన్న సల్మాన్ ఆమెను పిలిపించి మాట్లాడి.. అభినందించి, ఆమె పరిస్థితి చూసి చలించి, ఆమెను ప్రోత్సాహించాలని ఇంటిని బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. అంతేకాదు తను నటిస్తున్న దబాంగ్ 3లో ఆమె చేత ఓ పాట పాడిస్తానని ప్రామిస్ కూడా చేశాడట సల్లూ భాయ్. ముందు ముందు రేణు ముండల్ బాలీవుడ్‌లో మరిన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకునే అవాకాశం ఉంది.