Revanth Reddy : బీఆర్ఎస్‌కు వచ్చేది 25 స్థానాలే, షర్మిల డెడ్‌లైన్ గురించి నాకు తెలియదు- రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

దేశంలో ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలపొచ్చు. అది వారి హక్కు. బీజేపీ,ఎంఐఎం సింగిల్ డిజిట్ కే పరిమితం. Revanth Reddy

Revanth Reddy : బీఆర్ఎస్‌కు వచ్చేది 25 స్థానాలే, షర్మిల డెడ్‌లైన్ గురించి నాకు తెలియదు- రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Revanth Reddy (Photo : Google)

Updated On : September 27, 2023 / 9:47 PM IST

Revanth Reddy – BRS : మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ లో బీసీ నేతలు పీసీసీ అయ్యారని బీఆర్ఎస్ లో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా అయ్యారా? అని ప్రశ్నించారు.

షర్మిల డెడ్ లైన్ గురించి నాకు తెలీదు:
మైనంపల్లి హనుమంతరావు రేపు (సెప్టెంబర్ 28) కాంగ్రెస్ లో చేరుతున్నారని, స్పెషల్ కేటగిరీ కింద ఆయన ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో 25 స్థానాలకు మించి రావన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, ఎంఐఎం సింగిల్ డిజిట్ లకే పరిమితం అవుతాయని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక, వైఎస్ఆర్ టీపీ విలీనం విషయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు డెడ్ లైన్ పెట్టిన అంశంపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిల డెడ్ లైన్ విషయం గురించి తనకు తెలియదన్నారు రేవంత్ రెడ్డి.(Revanth Reddy)

Also Read..Nannapaneni Rajakumari : మీకు ఇక్కడేం పని అంటారా.. చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నన్నపనేని రాజకుమారి డిమాండ్

మీరు జంతర్ మంతర్ లో ఆందోళన చేయలేదా? అమెరికాలో నిరసన తెలపలేదా?
చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణకు ఏం సంబంధం? చంద్రబాబుకు సంఘీభావంగా తెలంగాణలో నిరసనలు చేయొద్దన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అనే విషయం మర్చిపోవద్దని కేటీఆర్ కు సూచించారు. అంతేకాదు దేశంలో ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలపొచ్చని, అది వారి హక్కు అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ దేశ రాజకీయాలకు సంబంధించిన అంశం:
బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ జంతర మంతర్ లో ఆందోళన చేయలేదని అని ప్రశ్నించారు. ఇక శాంతిభద్రతల అంశం అంటారా అది పోలీసులు చూసుకుంటారు అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడి ప్రజలు అమెరికాలో ఆందోళన చేయలేదా? అని రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కేవలం ఏపీకి సంబంధించిన విషయం కాదని, దేశ రాజకీయాలకు సంబంధించిన అంశం అని రేవంత్ రెడ్డి అన్నారు.(Revanth Reddy)

కేటీఆర్ కు బుర్ర తక్కువ.. ఆకలి ఎక్కువ:
”కేటీఆర్ కు బుర్ర తక్కువ.. ఆకలి ఎక్కువ. గవర్నర్ నామినేట్ ఎమ్మెల్సీ విషయంలో అలాగే వాదిస్తున్నారు. వివిధ రంగాలలో మేధావులను నామినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ కోటాలో రాజ్యసభ ఎంపీలను ఏ విధంగా ఎంపిక చేస్తారో గవర్నర్ కోటాలో కూడా సేమ్ ఉంటుంది. కేటీఆర్ కు చట్టం తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టం ఏంటి? పార్టీలో ఎవరైనా చేరొచ్చు. అందరికీ ఆహ్వానం చెబుతున్నాం. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.

Also Read..YS Sharmila : గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ’బీజేపీ రాష్ట్ర సమితి‘ దోస్తానా : వైఎస్ షర్మిల

కేసీఆర్ 6లక్షల కోట్ల అప్పు తెచ్చారు:
బీసీలకు మెజారిటీ సీట్లు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేయాలన్నది నా డిమాండ్. వీలైనంత మేరకు ఎక్కువ సీట్లు ఇస్తాం. బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇస్తాం. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అంశం.. మోదీ, కేసీఆర్ ప్లాన్. అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి కవిత కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందింది. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో సీఎం కేసీఆర్ కు చలి జ్వరం వచ్చింది. ఈ తొమ్మిదేళ్లలో వాళ్ల పరిపాలన ఏంటో చూపించారు. కేసీర్ 6 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. రాహుల్ గాంధీ.. నిజమే చెప్పారు. కేటీఆర్ మాదిరి బ్లఫ్ మాటలు చెప్పరు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపందుకున్న బీసీ నినాదం.. 40 సీట్లు ఇస్తారా?