‘రూలర్’ మోషన్ పోస్టర్ : ‘సీటీ మారో, సెల్ఫీ లే యారో’

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి ‘రూల‌ర్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 10:37 AM IST
‘రూలర్’ మోషన్ పోస్టర్ : ‘సీటీ మారో, సెల్ఫీ లే యారో’

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి ‘రూల‌ర్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి ‘రూల‌ర్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రూలర్’లో ఆయన రెండు గెటప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

రీసెంట్‌గా ‘రూలర్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంతన్ భట్ కంపోజ్ చేసిన మ్యూజిక్, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాసిన లిరిక్స్ చక్కగా సెట్ అయ్యాయి ఈ వీడియోలో.. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : NBK 105 ‘రూలర్’ : ‘ధర్మ’గా బాలయ్య రాయల్ లుక్

రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతుంది. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20న ‘రూలర్’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు.