Chandrababu Naidu : ప్రధాని మోదీ పాలన, ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు హాట్ కామెంట్స్

Chandrababu Naidu: ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యం.

Chandrababu Naidu : ప్రధాని మోదీ పాలన, ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు హాట్ కామెంట్స్

Chandrababu Naidu(Photo : Google)

Updated On : April 25, 2023 / 11:12 PM IST

Chandrababu Naidu : ప్రధాని మోదీ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వైఖరి మారిందా? త్వరలో చంద్రబాబు ఎన్డీయేలో చేరే అవకాశముందా? చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ప్రశ్నలు కలగక మానవు. ఓ జాతీయ చానల్ చర్చా వేదికలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలన, ఎన్డీయేలో చేరికపై కీలక కామెంట్స్ చేశారు. చర్చా వేదికలో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు చంద్రబాబు. ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా..? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు చంద్రబాబు.

దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమ్ మాత్రమే అన్నారాయన. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. నేనూ అదే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు చెప్పారు. దేశాభివృద్ధి కోసం, తెలుగు వారి కోసం నా పరిధిలో నేను పని చేస్తున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.(Chandrababu Naidu)

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

” భారత దేశ బలమేంటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. గతంలో కూడా నేను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారింది. దాని మీద మాత్రమే నేను అప్పట్లో పోరాడాను. దేశాభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు. పార్టీలు వేరైనా విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోదీ, నేను మాట్లాడుకున్నాం.

ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యం. టెక్నాలజీతో ఈ రెండూ సాధ్యం. పేదరికం లేని సమాజంలో భాగంగా ప్రతి ఒక్కరినీ ఎగువ మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేర్చే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్.. 4P పాలసీని రూపొందిస్తున్నాం. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆర్ధికాభివృద్ధి కోసం మెంటర్స్ ను సిద్దం చేయాలనే ఆలోచనతో ఉన్నాం.(Chandrababu Naidu)

నేను విజన్ 2020 అంటే.. నన్ను 420 అంటూ విమర్శలు చేశారు. కానీ నా విజన్ 2020 హైదరాబాద్ లో సాకారమైంది. సమాజం కోసం ముందు చూపుతో పని చేసే నేతలు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. గతంలో నన్ను ప్రతిపక్షాలు విమర్శించేవి. ఇప్పుడూ అలాగే విమర్శలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, సంస్కరణలు అమలు చేయాలి. జీఎస్టీ రియాల్టీ. డిజిటల్ కరెన్సీ రియాల్టీ. రూ.500పైన ఉన్న నోట్లను రద్దు చేస్తే అన్ని రకాల అవినీతి తగ్గిపోతుంది. నేను అధికారం కోసం లేను. దేశాభివృద్ధి కోసమే పని చేశాను.

Also Read..Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..

వాజ్ పేయి హయాంలో టీడీపీకి ఆరేడు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామన్నా మేం అంగీకరించలేదు. తెలుగు ప్రజలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం నా ముందున్న ప్రధాన లక్ష్యం. పేదలు లేని ఏపీని రూపొందించడమే నా ముందున్న ప్రధాన కర్తవ్యం” అని చంద్రబాబు నాయుడు చెప్పారు.