యోక్షైన్ నుంచి ఎంపీగా గెలిచిన రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్‭లో భగవత్గీత మీద ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి

సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ భారతీయ మూలాలు ఉన్నవారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరు 1960లో బ్రిటన్‭కు వలస వెళ్లారు

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు

సునాక్ తరచుగా తన వారసత్వం గురించి మాట్లాడుతుంటారు. అతని కుటుంబ విలువలు, సంస్కృతి గురించి తరచుగా ప్రస్తావిస్తారు

స్టాన్‭ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ చేసిన సునాక్.. ఇన్వెస్ట్‭మెంట్ బ్యాంకర్‭గా పని చేశారు

తన అత్తామామలను కలవడానికి సునాక్ తరుచూ బెంగళూరు వస్తుంటారు

కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రధాని ఎన్నికల్లో తన విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన సూట్లపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు

రిషి సునాక్ నికర ఆస్తుల విలువ 700 మిలియన్ పౌండ్లు. ఇవే కాకుండా యూకేలో చాలా ఆస్తులు ఉన్నాయి

ఒత్తిడి పెరిగిన సమయంలో ఆయన భగవత్గీత చదువుతారట

రిషికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ పడుతుంటారు