60 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 750 పైగా సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ.. 'నవరసనటనాసార్వబౌవంగా' పేరుని సంపాదించుకున్నాడు.

అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల.. ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.

జానపదం నుంచి పౌరాణికం వరకు ఎన్ని పాత్రలు వేసినా, కైకాల అంటే గుర్తుకు వచ్చేది.. యముడి పాత్ర మాత్రమే.

"ధర్మ పరిరక్షణ ధురంధరుండ.. యముండా" అంటూ కైకాల చెప్పిన డైలాగ్ ట్రెండ్ సెట్‌గా నిలిచింది. తన కెరీర్ మొత్తంలో కైకాల 5 సార్లు యముడిగా నటించారు.