లవంగాలను తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి..దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది

లవంగం నూనెని పంటి నొప్పికి మందుగా  వాడతారు.  నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే..  రెండు మూడు లవంగాలు నమిలితే చాలు..  ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు

కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు.  ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు.  అలాంటి వారి సమస్యను కూడా  లవంగాలతో చెక్ పెట్టొచ్చు

ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు

వర్షంలో తడిసినా.. చల్లని పదార్థాలు, స్వీట్లు తీసుకున్నా..కొందరికి జలుబు, దగ్గు పట్టేస్తుంది.. ఇలాంటివారు  రెండు లవంగాలను తీసుకుంటే..  త్వరగా ఉపశమనం కలుగుతుంది

రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు.. లవంగాలను  తినడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు. అంతేకాదు  ఇది బీపీని,  షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌‌లో ఉంచుతాయి

లవంగాలు  ఉపయోగించి లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు....రక్తపోటుకు నివారణకు లవంగం చక్కటి పరిష్కారం

లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. ఇది నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది

అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.అయితే లవంగాలను కూడా మితంగానే వినియోగించాలి. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు