ఉల్లిపాయల్లో తెల్లఉల్లి ప్రత్యేకం

ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లిపాయలు అరుదైన గుణాలున్నాయట.

ఈ ఉల్లిపాయలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందట. 

హైపర్ టెన్షనల్ లక్షణాలను సైతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

తెల్ల ఉల్లిపాయ కంటికి కూడా మేలు చేస్తుంది. 

ఐరన్ పదార్థాలు ఎక్కువగా ఉండి రక్తప్రసరణకు బాగా సహకరిస్తుంది. 

సోమరితనాన్ని దూరం చేసి చురుగ్గా ఉండేలా చేస్తుంది. 

ఫోలేట్, విటమిన్-బీ6లు ఉండటంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. 

అలసటగా ఉండటం, బరువు తగ్గాలనుకునేవారికి ఈ ఉల్లి చాలా మంచిది. 

కళ్ల నుంచి నీరు కారేవారికి మంచి పరిష్కారం దొరుకుతుంది కూడా.