వరద నీటిలోకి వెళ్లొద్దు.
విద్యుత్ పోల్స్, వైర్లకు దూరంగా ఉండండి.
మ్యాన్స్ హోల్స్ గుర్తించి అందరికీ తెలిసేలా ఎర్రజెండాలు పాతండి.
రోడ్డుపై 2 అడుగుల మేర ప్రవహించే నీరు ఉన్నా పెద్ద కార్లు కొట్టుకుపోతాయి.
కాబట్టి సాహసం చేయొద్దు.
వేడి చేసిన నీరే తాగండి.
తాజాగా వండిన ఆహారమే తినండి.
పరిసరాలు శుభ్రం చేసుకోండి.
దోమలు రాకుండా చూసుకోండి.