కడుపా..కండోమ్స్ మడుగా!: 80 మింగేశాడు

కడుపేనా అది..కాదు కాదు..ఎంత మాత్రం కాదు..కండోమ్ ల మడుగు. కండోమ్ లను వరస పెట్టి మింగేశాడు. ఏకం 80 కండోమ్ లను మింగేసి పొట్టలో స్టాక్ పెట్టేసుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 10:29 AM IST
కడుపా..కండోమ్స్ మడుగా!: 80 మింగేశాడు

కడుపేనా అది..కాదు కాదు..ఎంత మాత్రం కాదు..కండోమ్ ల మడుగు. కండోమ్ లను వరస పెట్టి మింగేశాడు. ఏకం 80 కండోమ్ లను మింగేసి పొట్టలో స్టాక్ పెట్టేసుకున్నాడు.

కడుపేనా అది..కాదు కాదు..ఎంత మాత్రం కాదు..కండోమ్ ల మడుగు. కండోమ్ లను వరస పెట్టి మింగేశాడు. ఏకం 80 కండోమ్ లను మింగేసి పొట్టలో స్టాక్ పెట్టేసుకున్నాడు. అసలు ఎందుకు మింగాడు..అందులోనే కండోమ్ లను ఎందుకు మింగాల్సి వచ్చిందనే అనుమానం రాక మానదు.కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం. అన్నట్లుగా ఈ స్మగ్లర్ కడుపును కాస్తా కండోమ్ ల చెరువుగా చేసేసాడు.
Also Read : రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

దుబాయి  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కడానికి వచ్చాడు 49 సంవత్సల వ్యక్తి. మామూలుగానే ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు సదరు యువకుడిని చెక్ చేసేశారు. ఈ చెక్కింగ్ లో భాగంగా అతని కడుపులో ఏదో ఉందని అనుమానించారు. ఏంటని ప్రశ్నించారు.  ఏమీ లేదని బుకాయించాడు. మరి వాళ్లు ఊరుకోరు కదా..అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్స్ వద్దకు తీసుకెళ్లి  X-ray తీయించారు. రిపోర్ట్ చూసి నోరెళ్లబెట్టారు.  ఎందుకంటే అతని కడుపు నిండా కండోమ్‌లే ఉన్నాయి. ఏకంగా 80 కండోమ్‌ల నిండా లిక్విడ్ కొకైన్ ఫిల్ చేసి..వాటిని మింగేశాడు. ఈ కొకైన 2.3 కేజీలు ఉందని అధికారులు తెలిపారు. 

వీటిని దుబాయ్ నుంచి ఈజిప్టు తీసుకెళ్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్  అధికారులు కోర్టుకు పంపించారు. దీంతో ఏప్రిల్ 22న అతనికి పదేళ్ల జైలు శిక్ష తోపాటు లక్ష దీనార్లు అంటే (సుమారు రూ. ఇరవై లక్షలు) జరిమానా విధించింది కోర్టు. 
Also Read : గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం