చేమ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.

జిగురుగా ఉండే ఈ దుంపలు అధిక శరీర బరువును తగ్గించేందుకు దోహదపడతాయి.

ఆహారం నిదానంగా జీర్ణంమై నెమ్మదిగా శరీరానికి శక్తినిస్తాయి. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

గుండె జబ్బులు రాకుండా చేయటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తాయి..రోగనిరోధకశక్తిని పెంచుతాయి..

చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు పీచు ఎక్కువగా ఉంటుంది.

చామదుంపలు ఎముకల పటిష్టతకు దోహదం చేస్తాయి..  అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్‌ల నుంచి కాపాడడమే కాకుండా క్యేన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం.

చామగడ్డ వేరులలో డయోస్జెనిన్ పుష్కలంగా  ఉంటుంది. కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పికి చికిత్సగా ఉపకరిస్తుంది.

దుంపలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపకరిస్తాయి. చామగడ్డ మూలాలలోని డయోస్జెనిన్ కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.

చామగడ్డ తినటం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి పోరాడుతున్న డయాబెటిక్ రోగులకు సరైన ఆహారం.

 పెద్దప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయి.