ప్రజా రవాణా ఒక నగరాన్ని అయితే గొప్పగా తీర్చి దిద్దుతుంది, లేదంటే విచ్ఛిన్నం చేస్తుంది. రోడ్లపై నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో మన దైనందిన జీవితానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతోంది. అయితే నగర ప్రయాణం అంటేనే నరకంలా మారిన అనేక నగరాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గ్లోబల్ సిటీ గైడ్స్‌కు చెందిన టైమ్ అవుట్ అనే సంస్థ తాజాగా ప్రజా రవాణా అత్యుత్తమంగా ఉండే నగరాల జాబితాను విడుదల చేసింది.