మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా బచ్చా.. చెర్రీపై చిరు సెటైర్..

మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్‌పై వేసిన సెటైర్ వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : May 2, 2020 / 09:17 AM IST
మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా బచ్చా.. చెర్రీపై చిరు సెటైర్..

మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్‌పై వేసిన సెటైర్ వైరల్ అవుతోంది..

లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవగా.. సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు, అభిమానులతో ఎల్లప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంత హుషారుగా ట్వీట్స్, రీ ట్వీట్స్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. శుక్రవారం చరణ్ చేసిన పోస్ట్‌కి తాజాగా చిరు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. చిరు తనయుడు రామ్ చరణ్, తన అమ్మ సురేఖ, నానమ్మ అంజనమ్మల వద్ద సరదాగా వెన్న తీయడం నేర్చుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది.

See Also | లైవ్‌లో రెచ్చగొట్టేసింది బాసూ..

కాగా నేడు అదే వీడియోని ట్యాగ్ చేసిన చిరంజీవి, ‘‘మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ నాదే. నువ్వెంత వెన్న రాసినా నీకు బెటర్ పొజిషన్ మాత్రం రాదు. కానీ, అదే గ్యారంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో’’.. అంటూ ఫన్నీగా పంచ్ వేస్తూ రీట్వీట్ చేశారు. జరిగింది. మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.