ఆధార్ కార్డులో ఏ వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా?

ఆధార్ కార్డుపై ఉన్న వివరాలను మార్చుకునేందుకు UIDAI 2019లో పరిమితి విధించింది.

అన్ని వివరాలను ఎక్కువసార్లు మార్చుకునే అవకాశం లేదు.

UIDAI ఆఫీస్ మెమోరాండం ప్రకారం..

ఆధార్‌పై పేరును 2 సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు.

డేట్ ఆఫ్ బర్త్(DOB), జెండర్(Gender) ను ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.

ఫొటో, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు. ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు.

పరిమితికి మించి మార్చుకోవడానికి..

మీకు దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి..

మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసుకోవాలి.