కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా?

అయితే ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది.

భారత మార్కెట్లో ఫిబ్రవరి 14, 2023 మధ్యాహ్నం (ఈరోజు) 12 గంటల నుంచి OnePlus 11 5G ఫోన్ సేల్ ప్రారంభమైంది.

స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా ఆధారితమైన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ప్రొడక్టులతో పాటు లాంచ్ అయింది.

OnePlus 11 5G ఫోన్ గ్రీన్, బ్లాక్ వంటి రెండు స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది.

వినియోగదారులు OnePlus అధికారిక ఆఫ్‌లైన్ ఛానెల్‌లు, Amazon ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

OnePlus 5G బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజీతో వస్తుంది.

ఈ వేరియంట్ ధర రూ.56,999గా ఉంది.

16GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.61,999గా ఉంది.

గత ఏడాదిలో వన్‌ప్లస్ 10 ప్రో కన్నా వన్‌ప్లస్ 11 5Gని సరసమైన ధరకే  అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో బేస్ వేరియంట్ ధర రూ.60,999గా  ఉంది.