ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరి ఒకటి...

కొబ్బరిలో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందించటంలో కొబ్బరిని మించింది లేదు.

కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి..

కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి బెస్ట్..

కొబ్బరి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది..

మూర్ఛ, అల్జీమర్స్ వంటి మెదడు రుగ్మతల నుండి కొబ్బరి కాపాడుతుంది..

శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయటంలో దోహదపడటంతోపాటు, వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

రాత్రి నిద్ర పోవడానికి అర గంట లేదా పావు గంట ముందు ఒక స్పూన్ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం యవ్వనంగా కాంతి వంతంగా మారుతుంది.

నీరసం, అలసట వంటి సమస్యలు కొబ్బరి తినటం ద్వారా తొలగించుకోవచ్చు..

ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు ఆహారంలో కొబ్బరిని బాగం చేసుకోవటం మంచిది.

ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు ఆహారంలో కొబ్బరిని బాగం చేసుకోవటం మంచిది.

కొబ్బరి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరిచి ఇతర రోగాలతో పోరాడే శక్తిని అందిస్తుంది.  క్రిములు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ ల కారణంగా ఏర్పడే వ్యాధులను నయం చేయడానికి కొబ్బరి ఉపకరిస్తుంది.

కొబ్బరిని పచ్చికొబ్బరితో చట్నీగా, లౌజుగా, కూరల్లో ఎలాగైనా వాడుకోవచ్చు..

అందుకే కొబ్బరి చెట్టును  భూలో కల్ప వృక్షం  అంటారు..

కొబ్బరి చెట్టులో అన్ని ఉపయోగాలే..ఆకు, పీచు, కాయలు, కాండం, అన్ని  ఉపయోగాలే..