ప్రభాస్ 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా ప్రమోషన్స్ లో భాగమవుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.