మరోసారి బిగ్‌బాస్‌లో సోహైల్

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం అంతా ఫ్యామిలీ ఎపిసోడ్స్ కావడంతో కంటెస్టెంట్స్ కి చెందిన ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని బిగ్‌బాస్ హౌజ్ కి పిలిపించారు.

శనివారం నాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్ కోసం బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అయిన సోహెల్ మళ్ళీ బిగ్‌బాస్ లోకి వచ్చి సందడి చేశాడు.

సోహెల్ మళ్ళీ బిగ్‌బాస్ లో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌బాస్ లో నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సోహెల్.