గుంటూరు
Monday, July 9, 2018 - 06:58

విజయవాడ : ఓటమి భయంతోనే చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ రావడం బాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. బాబుకు ధన, భూ దాహం పట్టుకుందని అందుకే డాట్‌ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. బురదలో కూరుకు పోయిన బాబు మాకు బురద అంటించే ప్రయాత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

Saturday, July 7, 2018 - 17:31

విజయవాడ : జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం నడవమన్నట్లుగా నడుస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆరోపించారు. పవన్‌ నటించిన సినిమాల్లో ఒక్క జాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ వేరే డైరెక్టర్లు చేసినవే అని.. ఇప్పుడు రాజకీయం కూడా కేంద్రం డైరెక్షన్‌లోనే నడుపుతున్నాడన్నారు. చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి పదవి నుంచి.. పవన్‌ రాజీనామా చేయమనడం హస్యాస్పదమన్నారు....

Saturday, July 7, 2018 - 16:57

గుంటూరు : జిల్లాలోని తాడేపల్లిలోని డోలాస్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కోడలిని ఇంట్లో బంధించి అత్తింటి వేధింపులకు పాల్పడ్డారు... అంతేకాకుండా అనుమానంతో జుట్టు కత్తిరించారు. గతంలో భర్త రాంబాబు తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మంచిగా చూసుకుంటానని చెప్పి... మళ్లీ అదే తీరుగా ప్రవర్తిస్తున్నాడని మేరి చెబుతోంది. భర్తే కాకుండా అత్తామామలు కూడా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం...

Saturday, July 7, 2018 - 13:23

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌.. రాజ్యాంగం, సివిల్‌, అడ్మినిస్ట్రేటివ్‌లాలో ప్రావీణ్యులు. 2004 అక్టోబరు 14న కేరళ హైకోర్టు జడ్జిగానూ...

Saturday, July 7, 2018 - 11:25

విజయవాడ : జాతీయ లా కమిషన్ సమావేశానికి టిడిపి దూరంగా ఉంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలను వదిలేసి కేంద్రం ఎన్నికలపై దృష్టి పెడుతుండడంపై టిడిపి తప్పుబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.

ఏపీ ప్రభుత్వం..టిడిపి పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాష్ట్ర సమస్యలే ప్రధాన ఏజెండా అని...

Saturday, July 7, 2018 - 09:14

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సింగపూర్‌ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్ళనున్నారు. సింగపూర్‌లో సీఎం బృందం మూడు రోజులపాటు పర్యటించనుంది. ఏపీలో వ్యాపారం, వ్యవసాయ అంశాలపై వివరించనున్న సీఎం. చంద్రబాబు వెంట మంత్రి యనమలతోపాటు.. పలువురు అధికారులు వెళ్ళనున్నారు.

Saturday, July 7, 2018 - 08:11
Saturday, July 7, 2018 - 06:18

విజయవాడ : పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించపోయినా రాష్ట్ర ప్రభుత్వం పనులను స్పీడ్‌గా చేస్తుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే డయాఫ్రాం వాల్‌ నిర్మాణం పూర్తవటంతో పాటు కాఫర్‌ డ్యామ్‌ పనులు పుంజుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరానికి మూలమైన భూ నిర్వాసితులను ప్రభుత్వం మరిచిపోయింది. నిర్వాసితులకు న్యాయం జరగకపోవటంతో వారు...

Friday, July 6, 2018 - 21:46

గుంటూరు : విభజన చట్టంలోని హామీలను సాధించేందుకు ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యంకాదంటూ  కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై  సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనికోసం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలని మంత్రివర్గభేటీలో డెసిషన్‌ తీసుకున్నారు. 

రాష్ట్ర విభజన హామీల అమలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్‌...

Friday, July 6, 2018 - 17:40

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్‌పై ప్రధానంగా కేబినెట్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీరుపై ప్రత్యేక నివేదిక రూపొందించి కేబినెట్‌ తీర్మానం చేయనుంది. ఇక నిరుద్యోగ భృతి విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం...

Pages

Don't Miss