గుంటూరు
Tuesday, December 5, 2017 - 12:03

గుంటూరు : అమరావతిలోని ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పాము కలకలం సృష్టించింది. హోంశాఖ సెక్షన్‌లో ఇది కనిపించింది. పారిశుధ్య కార్మికులు చెత్త తొలగిస్తుండగా కనిపించిన పాము కనిపిడచంతో హడలిపోయారు. ఆ తర్వాత దీనిని చంపేశారు. 

Tuesday, December 5, 2017 - 09:30

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. స్థానిక రైల్వేస్టేషన్‌ 3వ గేట్‌ వద్ద గూడ్స్‌ రైలు కిందపడి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. పిల్లలు దిగ్విజయ్‌,గణేష్ సాయి మార్టూరులో చదువుతున్నారు. మార్టూరు నుంచి పిల్లలను నరసరావుపేట కు తీసుకు వచ్చిన విజయలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు...

Monday, December 4, 2017 - 21:30

సియోల్ : నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్‌ సందర్శించి బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కొరియన్ కంపెనీలను కోరారు. తయారీ రంగంలో ఇండియా దూసుకువెళ్తోందని పెట్టుబడులకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. దక్షిణ కొరియా సాధించిన...

Monday, December 4, 2017 - 18:42

గుంటూరు : వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతను తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా పొలాల్లో పిచికారీ చేసినప్పుడు రైతులకు కలిగే ఆరోగ్య సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. పిచికారీ కోసం రైతులు గంటల తరబడి పొలాల్లో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అప్రయత్నంగా పురుగుమందులను గాలితో పాటు పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఇలాంటి సమస్యలకూ...

Monday, December 4, 2017 - 18:38

ఢిల్లీ : కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ఆత్మబలిదానాలు చేసిందని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడమేంటని KVP ప్రశ్నించారు. 

Monday, December 4, 2017 - 16:30

గుంటూరు : జిల్లా అచ్చంపేట మండలం కొండూరులో ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు అక్రమించుకుని పంట వేశారు. అక్రమణకు గురైన భూముల్లో పంటను కోసుకునేందుకు సీపీఎం ఆధ్వర్యంలో రైతులు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, December 4, 2017 - 07:44

గుంటూరు : కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌లో రగడ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నా.. బీసీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, దీనిపట్ల టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 
చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ ...

Sunday, December 3, 2017 - 20:43

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పేర్కొన్నారు. ఆయన ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్తిక సమస్యలతో సతమతమౌతున్న అవసరం లేని పోలవరం భారాన్ని మోయాల్సినవసరం లేదన్నారు. కానీ రాష్ట్రమే నిర్మాణం చేయాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటో తెలియడం లేదన్నారు. పోలవరం నిర్మాణానికి అన్ని అనుమతులూ తీసుకువచ్చింది దివంగత సీఎం వైఎస్...

Sunday, December 3, 2017 - 18:26

గుంటూరు : ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతికతతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుంటూ ఓమెగా ఆసుపత్రి ఎండీ నాగకిశోర్ పేర్కొన్నారు. నగరంలో 110 పడకల ఆసుపత్రిలో పెట్ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్, డిజిటల్ మామోగ్రఫీ, ఎంఆర్ఐ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో అన్ని విభాగాలను ఒక్కచోట చేర్చి సర్జికల్, మెడికల్ అంకాలజిస్టుల పర్యవేక్షణలో అత్తుమ శిక్షణ అందించడం...

Pages

Don't Miss