మంత్రి అఖిలప్రియ

12:20 - April 24, 2018

హైదరాబాద్ : సీఎంతో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి భేటీ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం సీఎంతో అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి భేటీ కానున్నారు. శోభానాగిరెడ్డి వర్ధంతి కావడంతో ఈ రోజు సమావేశానికి హాజరు కాలేనని అఖిల ప్రియ తెలిపారు. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య రోజురోజుకూ విభేదాలు ముదురుతుండటంతో.. ఇద్దరిని అమరావతి రావాలని సీఎం ఆదేశించారు. 

 

11:39 - April 24, 2018

గుంటూరు : ఉండవల్లిలోని నివాసంలో ఈ రోజు సాయంత్రం చంద్రబాబుని పార్టీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ భేటీ కానున్నారు. రెండు రోజుల క్రితం ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఇరువురితో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 30న తిరుపతి సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించనున్నారు. 

 

20:59 - April 17, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటున్నారు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ. రాష్ట్రంలో టూరిస్ట్‌ ప్రాంతాలను అభివృద్ధి చేయడం చేసి... దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. ఇందుకోసం సెప్టెంబర్‌ 6 నుంచి 8వ తేదీ వరకు 'ఇండియన్‌ టూర్‌ ఆపరేటర్స్‌' ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామంటున్న అఖిలప్రియతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

20:20 - November 11, 2017

కర్నూలు : ఆడపిల్లలకు విద్య కొండంత అండ అన్నారు మంత్రి అఖిలప్రియ. తప్పకుండా ప్రతి ఆడపిల్ల చదువుకుని ఉన్నతస్ధాయికి ఎదగాలని ఆమె సూచించారు. కర్నూలులో మైనార్టీస్ వెల్‌ఫేర్‌ డే సందర్భంగా ఉస్మానియా కాలేజీలో మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచస్ధాయిలో చదువుతో పోటీ పడగలిగే నాణ్యమైన విద్య కోసం సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. 


 

19:21 - October 30, 2017

ఢిల్లీ : రాయలసీమలో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కేంద్రాన్ని కోరారు. కేంద్ర పర్యాటక ఆర్థిక సహాయ సంస్థ శాఖను విజయవాడలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఢిల్లీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పర్యాటక ప్రాజెక్టులకు నిధుల మంజూరుతోపాటు వచ్చే నెలలో లండన్‌లో జరిగే వరల్డ్‌ ట్రావెల్‌ మార్ట్‌ పొల్గొనే అంశంపై చర్చించారు. 

 

16:23 - September 6, 2017

గుంటూరు : ఏపీ పర్యటక శాఖ మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ జరిగింది. అలీ అనే వ్యక్తి ఓట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం మంత్రి సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ చేసిన సంతకం అప్లికేషన్ తిరిగి అఖిలప్రియకే ఇవ్వడంతో ఆమె తన సంతకం ఫోర్జరీ అయిందని గుర్తించి ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అలీని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:38 - August 5, 2017

కర్నూలు : చిన్న వయసులో మంత్రి పదవి రావడంతో అఖిలప్రియకు కొమ్ములు వచ్చాయని వైసీపీ నేత రోజాల అన్నారు. అఖిల ప్రియకు ఏం చేస్తుందో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత అఖిల ప్రియకు లేదన్నారు. తల్లి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అఖిల ప్రియ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తల్లిదండ్రుల కంటే పదవే ముఖ్యమనుకున్నావన్నారు. నంద్యాలలో లక్ష మందితో మీటింగ్ పెట్టి.. మూడేళ్లలో ఇచ్చిన 6 వందల హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెబితే ప్రజలు ఓట్లు వేయాలో వద్దో ఆలోచిస్తారన్నారు.  తల్లిదండ్రుల కంటే నీతిమాలిన రాజకీయం చేస్తోందా నీవా? జగనా అని ప్రశ్నించింది. నీవు జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకోవడం ఏంటి అన్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకుమొహం చెల్లక ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.  ఇప్పటి వరకు లోకేష్ ఒక్కడే పప్పునుకున్నా... అఖిల ప్రియ లేడీ పప్పు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చుట్టూ మొత్తం పప్పు బ్యాచ్ చేరిందన్నారు. జగన్ నిప్పులాంటి వాడని కాబట్టే చక్రపాణి రెడ్డితో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు కు ధైర్యం వుంటే పార్టీమారిన 20 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరు పప్పో, ఎవరు నిప్పో ప్రజలే చెప్తారని తెలిపారు.

19:05 - June 16, 2017

కర్నూలు: జిల్లా టీడీపీలో మరోసారి కలకలం రేగింది. మంత్రి భూమా అఖిలప్రియ వైఖరిపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశారు. కర్నూల్లో టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసభేటీ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో తమను పట్టించుకోవడం లేదని మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి మండిపడుతున్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రులు సుజనాచౌదరి, కాల్వశ్రీనివాసులు నుంచి ఫోన్‌ రావడంతో సుబ్బరారెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అఖిలప్రియ వర్గంతో పొసగని శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు ఏమలుపు తీసుకుంటుందోనని టీడీపీ క్యాడర్‌ ఆందోళన పడుతోంది. 

19:34 - June 15, 2017

అమరావతి: కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.. శిల్పా మోహన్‌ రెడ్డి వైసీపీలో చేరడంతో నంద్యాల ఉప ఎన్నికలో బ్రహ్మానందరెడ్డికి లైన్‌ క్లియర్‌ అయింది.. బ్రహ్మానందరెడ్డి పేరు పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని.. మంత్రి అఖిల ప్రియ చెప్పారు.. తమ ప్రత్యర్థులు శిల్పా మోహన్‌ రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి ఒక్కటైనా భూమా కుటుంబాన్ని ఓడించలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss

Subscribe to RSS - మంత్రి అఖిలప్రియ