Home » షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇవ్వను : ఎంపీ రఘురామకృష్ణంరాజు
Published
7 months agoon
By
nagamaniవైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు..పరిమితులు అతిక్రమించి పార్టీపై ఆరోపణలు చేశారనీ..ఇటీవల జరిగిన పలు కీలక పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ పార్టీ నోటీసులు జారీ చేసింది. దీనికి ఎంపీ సమాధానం చాలా లాజికల్ గా ఇచ్చారు.
ఈ నోటీసులకు సమాధానం ఇవ్వనని చెబుతూనే పలు అంశాలను ప్రస్తావించారు. YSR కాంగ్రెస్ పార్టీ పేరుమారిందా? ఆ విషయం నాకు తెలీదు..వైసీపీ ఇచ్చిన నోటీసుకు అస్సలు చట్టబద్దత లేదని ఆరోపిస్తూ దీనికి నేను సమాధానం ఇవ్వనని తేల్చి చెప్పారు ఎంపీ.
తనకు పంపిన షోకాజ్ నోటీస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాశారని.. కానీ తాను ఎంపీగా గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకటి ఉందన్నారు. అంతేకాదు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు మీద తనకు షోకాజ్ నోటీస్ పంపారని.. కానీ తాను గెలిచిన పార్టీ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు.
తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చేముందు అధినేత వైఎస్ జగన్ అనుమతితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌మీద ప్రింట్ చేశారా అని ప్రశ్నించారు. అలాగే క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే స్పందిస్తాను అని సమాధానం చెప్పారు.