Zinc : పంట ఎదుగుదలతోపాటు, దిగుబడిలో ముఖ్యపాత్ర పోషించే జింక్!

పైరుపై లోపం కనిపించినప్పుడు : జింక్‌ లోప నిర్ధారణ ఆకుల పరీక్ష ద్వారా లేదా లోప లక్షణాల ద్వారా చేసుకున్నప్పుడు 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పంట కాల పరిమితిలో లేదా పంట లోప తీవ్రతను బట్టి 2-8 సార్లు పిచికారి చేయాలి. తదుపరి సీజన్‌లో మట్టి నమూనా పరీక్ష తప్పని సరిగా చేయించి అవసరాన్ని బట్టి జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి.

Zinc : పంట ఎదుగుదలతోపాటు, దిగుబడిలో ముఖ్యపాత్ర పోషించే జింక్!

Zinc plays an important role in crop growth and yield!

Zinc : జింక్‌ ధాతువు పంట ఎదుగుదల మరియు దిగుబడిలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ధాతువు ఐరన్‌ మరియు మాంగనీస్‌లతో కూడి పత్రహారితం తయారిలో తోడ్పడుతుంది. జింకు ధాతువు లోపించినప్పుడు వివిధ పంటలలో తొలుత మొక్క క్రింద ఆకుల ఈనెల మధ్య పసుపు రంగుకు రావడం, ఆకులు పరిమాణంలో చిన్నవిగా మారడం, కణుపుల మధ్య దూరం తగ్గడం తద్వారా మొక్క ఎదుగుదల కృశించిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అంతేగాక కొన్ని పంటలలో ఈ ధాతువు లోపం వల్ల పూత తగ్గడం, కాపు తగ్గిపోవడం, పంట పక్వత అలస్యం కావడం, చిగురుఠాకులు ఎండిపోవడం మరియు లేత దశలోనే అకులు రాలిపోవడం అనేవి ప్రధాన లక్షణాలుగా గుర్తించవచ్చు. వరిలో ఈ ధాతువు లోపించినప్పుడు ఆకులు ఎండిపోయి, పెలుసుగా మారి విరిచినప్పుడు ‘టప్‌’ అనే శబ్ధం వస్తుంది. ఆకులపై కుష్టు మచ్చలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఆకులు పదునుగా ఉండి చర్మానికి తాకినప్పుడు. గాట్లు ఏర్పడటం జరుగుతుంది. వేరుశనగలో అకులు చిన్నవిగా. మారి, గుబురుగా కనిపిస్తాయి. నిమ్మజాతి తోటల్లో ఆకులు ఈనెల మధ్య పసువు రంగుకు మారి, ఈనెలు లేత ఆకుపచ్చగా. కనిపిస్తాయి.

జింక్‌ ధాతువు లోప సవరణ : వివిధ రకాల నేలల్లో జింకు మోతాదు వేరువేరుగా ఉంటుంది. ఎర్రనేలల్లో – 0.6 మి.గ్రా కన్నా తక్కువగా ఉన్నా/ కిలో మట్టి నమూనాకు, నల్లనేలల్లో – 0.7 మి.గ్రా కన్నాతక్కువగా ఉంటే కిలో మట్టి నమూనాకు ఈ నేలల్లో పండించు వంటలు జింక్‌ లోపాన్ని ప్రదర్శిస్తాయి. సాధారణంగా జింక్‌ లోప నివారణకు జింక్‌ సల్ఫేట్‌ 20 కిలో ఎకరానికి గాని 50 కిలోలు హెక్టారుకు వేసుకొని నేలలో కలియదున్నాలి. ఈ విధంగా ప్రతి రెండు నుండి 3 పంటలకు ఒకసారి వేయాలి.

సాధారణంగా యాసంగి పంటకు వేసుకోబోయే ముందు క్రమం తప్పకుండా పొలంలో తగిన మోతాదులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్శికంపోస్ట్‌, పచ్చిరొట్ట లేదా చెక్కపిండి లాంటి సేంద్రియ ఎరువులను వాడాలి. అందువల్ల భూమిలో ఉన్న ముడిజింక్‌ మొక్కలకు లభ్యతరూపంలో అందడమే కాకుండా వాడిన జింక్‌ సల్ఫేట్‌ కూడా పంటలకు బాగా. అందేటట్లు దోహదపడుతుంది.

పైరుపై లోపం కనిపించినప్పుడు : జింక్‌ లోప నిర్ధారణ ఆకుల పరీక్ష ద్వారా లేదా లోప లక్షణాల ద్వారా చేసుకున్నప్పుడు 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పంట కాల పరిమితిలో లేదా పంట లోప తీవ్రతను బట్టి 2-8 సార్లు పిచికారి చేయాలి. తదుపరి సీజన్‌లో మట్టి నమూనా పరీక్ష తప్పని సరిగా చేయించి అవసరాన్ని బట్టి జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. పండ్లతోటల విషయంలో భూసార పరీక్షతో పాటు, చెట్ల ఆకుల విశ్లేషణ ఎంతైనా అవసరం. ఎందుకంటే వయసు మీరిన కొలదీ చెట్ల వేర్లు భూమిలోపలి పొరల్లోకి వెళతాయి కాబట్టి అక్కడి పోషకాల లభ్యతపై మట్టి పరీక్షతో పూర్తిస్థాయి సమాచారం ఉండదు. సమస్యాత్మక నేలలను బాగు చేయడానికి జిప్సం వాడుతున్నప్పుడు మొదటిసారి 80-40 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయడమే గాక, మొదటి 4-5 పంటలకు మొత్తం చౌడు విచ్చుకునే వరకు జింక్‌ సల్ఫేట్‌ వేస్తూ అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి.