Minister KTR: జగదీష్ కుటుంబానికి అండగా ఉంటాం.. జగదీష్ పార్ధివదేహానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ (47) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. జగదీష్ పార్ధివదేహానికి సోమవారం మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.

Minister KTR
Kusuma Jagadish: ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మల్లంపల్లిలోని జగదీష్ నివాసంకు చేరుకున్న మంత్రి కేటీఆర్ ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అన్నివిధాల పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని వారికి మంత్రి ధైర్యం చెప్పారు.
Fashion Show Event Ramp Walk: నోయిడా ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి..ఇనుప స్తంభం పడి మోడల్ మృతి
కుసుమ జగదీష్ (47) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో స్నానంచేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. భార్య రమాదేవి గన్‌మెన్ల సాయంతో వెంటనే జగదీష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్సపొందుతూ జగదీష్ కన్నుమూశారు. కుసుమ జగదీశ్ మృతివార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో జగదీష్ అంత్యక్రియల ఏర్పాట్ల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
Houston Club Firing: అమెరికాలో మరోసారి కాల్పులమోత.. హ్యూస్టన్ నగరంలో ఘటన
సోమవారం జగదీష్ అంత్యక్రియల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగుకు చేరుకొని, అక్కడినుంచి మల్లంపల్లి గ్రామంకు వెళ్లి కుసుమ జగదీష్ అంతిమ సంస్కారాలలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.